🙏పాఠశాల అసెంబ్లీ కోసం🙏
🇬🇸🇷🇦🇴🌎
♦సుభాషిత వాక్కు
తన తప్పును గుర్తించేవాడు జ్ఞాని
దౌర్భాగ్యం ఏమిటంటే మనచుట్టు మేధావులకు కొదవలేదు
జ్ఞానుల ఉనికి లేదు"
"Fools wait for the opportunities, ordinary people use the opportunities, but wise people create the opportunities."
♦మంచి పద్యం
కల్లలాడ వద్దు కలతలు పడవద్దు
సత్యమెల్ల పలుకు సంతసంబు
సాయమెప్పుడుండు సత్యము నీకును
వాస్తవంబు వేము వారి మాట
🔺భావం:-
ఓ వేము ! అబద్ధము ఆడవద్దు. ఇబ్బందులు పడవద్దు. సత్యవాక్కు వలన సంతోషం కలుగుతుంది.
🔹నేటి జీ కె:
1) హోలోగ్రఫీ అనేది దేన్ని తెలియజేస్తుంది?
జ:-త్రిమితీయ ఫొటోగ్రఫీ
2) వాహనాల్లో డ్రైవర్ల పక్కన అమర్చే దర్పణం?
జ: కుంభాకార దర్పణం
3) కాంతి కిరణాలు ఏ తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి?
జ: తిర్యక్ తరంగాలు
4) కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?
న్యూటన్
5) రామన్ ఫలితం దేనికి సంబంధించింది?
జ: కాంతి
6) మాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ప్రకారం కాంతి ఏ రూపంలో ప్రయాణిస్తుంది?
జ:;ఫోటాన్
7) అతి నీలలోహిత కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త?
జ: రిట్టర్