అత్యాశ-ప్రాణ సంకటం

అత్యాశ-ప్రాణ సంకటం

SHYAMPRASAD +91 8099099083
0

అత్యాశ-ప్రాణ సంకటం
రామాపురం జమిందారు చాలా మంచివాడుప్రజలకు ఆయనంటే అభిమానం కూడా ఎక్కువే ఊళ్ళో చంద్రయ్య అనే నోటి దురుసు మనిషి ఒకడు ఉన్నాడుతాగాడంటే వాడు నోటికొచ్చింది వాగుతూఅందరిని కూడగల్పుకొనిగొప్పలు చెప్పుకొని ఆనందించేవాడుమాటలు కోటలు దాటుతాయిఒకనాడు చంద్రయ్య ;నాకేగనుక జమిందారుకి ఉన్నంత భూమి ఉంటే... చూస్కో... నాసామిరంగ... అదరగొట్టేస్తాను... ఒక్కొక్కరి కూలి రెట్టింపుచేస్తా...;నంటూ కల్లుపాక దగ్గర ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు మాటలు జమిందారు గారికి తెలిశాయివెంటనే జమిందారు మర్నాడు ఉదయం చంద్రయ్యకు కబురు చేశాడు. ;ఇదిగో చంద్రయ్యనీకు ఎంత భూమి కావాలోతీసుకోఇప్పుడు సూర్యోదయం కావస్తుందినీవు ఇక్కడినుండి ఎంత దూరం నడుస్తావో అంత భూమి నీకిస్తానుఅయితే ఒక షరతు సూర్యాస్తమయం వేళకు మళ్ళీ ఇక్కడకు రావాలి సుమా!; అని అన్నాడుచంద్రయ్య సంతోషంతో సరేనని పరుగు లాంటి నడకతో బయలుదేరాడుఆకలిదప్పులు లేవుఆశ... అత్యాశతో ఎంత దూరం నడిస్తే అంత భూమి... తనదేనని నడుస్తున్నాడునడచినకొద్దీ సారవంతమైన భూములు కనబడుతున్నాయిమధ్యాహ్నం అయ్యిందిమళ్ళీ తిరిగి వెళ్ళాలికాని అత్యాశ ముందుకే లాక్కుపోతుంది.
మధ్యాహ్నం రెండు గంటలయ్యిందివెనక్కు తిరుగుదాం అనుకున్నాడుమనసు అంగీకరించలేదు కనపడే పొలాలను చుట్టి వెళదాం అనుకున్నాడుసాయంకాలం కావస్తుందిమరికొద్ది దూరం నడిచి బాధతోనే వెనుకకుమరలాడునడుస్తున్నాడుకాళ్ళు మారాం చేస్తున్నాయిఆయాసంగా ఉందిఆశ అధికారాన్ని చలాయించిందిఎలాగో లేని ఓపిక తెచ్చుకొని పరిగెడుతున్నాడుశరీరంలో ప్రతి అణువు ఎదురు తిరుగుతున్నదిపడమటి దిక్కునఎర్రటి సూర్యబింబం సగం సముద్రంలోకి కుంగి పోయిందిచేరాల్సిన గమ్యం చాలా దూరం ఉందిప్రాణం బిగపట్టి పరిగెడుతున్నాడునవనాడులు కుంగి పోతున్నాయిఅడుగులు పడుతున్నాయో లేదోగమనించే శక్తి కోల్పోయాడుజమిందారు ఇంకా పది గజాల దూరంలో ఉన్నాడుగ్రామ ప్రజలంతా ఆశ్చర్యంతో చూస్తున్నారుసూర్యుడు అస్తమించాడుఒక్కసారిగా చంద్రయ్య నేలమీద బోర్లాపడ్డాడుఅంతేమళ్ళీ లేవలేదుఆశ ఎంత పనైనా చేయిస్తుందిచివరకు చంద్రయ్య శవానికి ఆరడుగుల నేలే సరిపోయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!