బుద్ధి

బుద్ధి

SHYAMPRASAD +91 8099099083
0

బుద్ధి
పూర్వం బ్రహ్మపుత్ర నదీతీరంలో దట్టమైన అరణ్యం ఉండేదిదాంట్లో రకరకాల క్రిమికీటకాలుజంతువులు సుఖంగా జీవిస్తూ ఉండేవి వనంలో కర్పూర తిలకం అనే పెద్ద ఏనుగు కూడా ఉండేదిఅది కదలివస్తుంటే చిన్న కొండనడిచివస్తోందా అన్నట్లుండేదిదాని భారీ కాయాన్నిశక్తిని చూచి చిన్న చిన్న జంతువులు భయముతో గజగజలాడేవిపొడుగైన దాని దంతాలు తగిలీదాని అడుగుల కింద పడీ చిన్న జంతువులు చాలా వరకు నశించాయికొన్ని అడవిని వదిలి వేరే చోటికి వలసవెళ్ళాయిచిన్న జంతువులు లేకపోవడంతో వనంలోని నక్కలకు ఆహారం కరువయిందిఒకటొకటిగా మరణించసాగాయితమజాతి అంతరించిపోతుందేమోననే భయముతో
ఒక రోజు నక్కలన్నీ సమావేశం అయ్యాయి ఏనుగు చస్తే మనకు కొన్ని నెలల దాకా తిండికి లోటు ఉండదుఇది చచ్చిందని తెలిస్తే పారిపోయిన జంతువులు కూడా తిరిగి వస్తాయిమనకు కడుపునిండా భోజనందొరుకుతుంది"అన్నది ఒక కుంటి నక్క. "నేను చంపుతాఅంటూ లేచింది ఒక పిల్లనక్క దాని మాటలు విని నక్కలన్నీ ఫక్కున నవ్వాయి. "ఇది ఆడుకొనే ఏనుగు అనుకొన్నావాకాదుదీన్ని చంపడం మాకే చేతకాదునీవేంచేస్తావువెళ్ళి ఆడుకోఅన్నది మరొక నక్కవాళ్ళ మాటలు వినగానే నక్క పిల్లకు
కోపం వచ్చిందిఅయినా బయటపడకుండా "వయసునుశరీరాన్ని చూసి మీరు తెలివితేటల్ని లెక్కించడం సరి కాదునాకు అవకాశం ఇస్తే నా ప్రతిభ చూపిస్తాఅంది నక్కపిల్ల మాటలు విన్న ముసలి నక్క "సరేచూద్దాంకానీ!" అన్నాయిమరునాడు పొద్దున్నే నక్కపిల్ల గజరాజు దగ్గరకు వెళ్ళిందిసాష్టాంగ నమస్కారం చేసి "మహారాజుకు జయముజయముఅంటూ వినయంగా నిలుచుందిమహారాజు అని తనను పోల్చేసరికి దంతికి ఆశ్చర్యంవేసింది. "ఎవరు నువ్వుఅంది బిగ్గరుగా. "ప్రభూ నేను నక్క పిల్లనుఅందరూ నన్ను బుద్ధిజీవి అంటారుమృగరాజు సింహం ముసలిదై ఎక్కడో మూలనపడి ఉంటోందిమహారాజు గుణాలన్ని మీలో ఉన్నాయికాబట్టి మహారాజాఅని పిలిచాను అడవికి మిమ్ముల్ని రాజుని చేసేందుకు తీసుకురమ్మని జంతువులు నన్ను పంపాయిబయల్దేరండిఅంది నక్క పిల్లఏనుగుకు ఎక్కడలేని సంతోషం కలిగింది. "ఎంతదూరం వెళ్ళాలి మనంఅని గర్వంగాఅడిగింది.
"దగ్గరేనాతోరండి స్వామీ!" అంటూ జిత్తులమారి నక్కపిల్ల ఒక ఊబి వైపుగా ముందు నడవసాగిందిదాని వెనకే రాచఠీవితో మాతంగం నడవసాగిందిరాజునవుతాననే ఆనందంతో కలులు కంటూ అడుగులేస్తున్న ద్విరదంహఠాత్తుగా ఊబిలో దిగబడిందితెలివి తెచ్చుకొని "కాపాడండికాపాడండి"అని అరవసాగింది. "ప్రభూజిత్తులమారినైన నన్ను నమ్మి వచ్చినందుకు మీకిది ఫలితంఇప్పుడు పశ్చాత్తాపపడి
ప్రయోజనం లేదుఅంది నక్కపిల్లఏనుగు కేకలు విని అక్కడకు జంతువులు చేరే సరికే ఏనుగు పూర్తిగా ఊబిలో మునిగిపోయిందిఅన్నీ నక్క పిల్ల తెలివితేటల్ని మెచ్చుకున్నాయి

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!