రెండు కవితలు

రెండు కవితలు

SHYAMPRASAD +91 8099099083
0


రెండు కవితలు
చాలా శతాబ్దాల క్రిందటి సంగతి- ఒకరోజున ఏథెన్స్ కి వెళ్లే రోడ్డుమీద ఇద్దరు కవులు కలిశారు.
ఇద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటున్నారు:
ఒక కవి రెండవవాడిని అడిగాడు- ; మధ్య కాలంలో ఏమేమి కవితలు రాశావు? నీ రచనా వ్యాసంగం
ఎలా సాగుతోంది; అని.
రెండవ కవి చెప్పాడు గర్వంగా- ;ఇప్పుడే నేను అత్యద్భుతమైన కవితను ఒకదాన్ని రాయటం పూర్తి
చేశాను- బహుశ: మన గ్రీకుభాషలో రాయబడ్డ అతి గొప్ప కవిత ఇదే అయి ఉంటుంది. మహా
శక్తిసమన్వితుడైన జియుస్ కి ఆహ్వానం పల్కుతుందది.;
అలా అని, అతను తన అంగరఖా జేబులోంచి ఒక కాయితాన్ని తీసి, ;ఇదిగో, చూడు. నా జేబులోనే
ఉన్నదది. నేను నీకు దాన్ని చదివి వినిపిస్తాను. రా, మనం ఇక్కడే, చెట్టు కింద నీడలో
కూర్చుందాం; అన్నాడు.
పైన అతడు దాన్ని చదివి వినిపించాడు. చాలా పెద్ద కవిత అది.
మొదటివాడు దాన్ని శ్రధ్ధగా విని, అన్నాడు సౌహార్ద్రతతో- ;ఇది నిజంగానే అద్భుతమైన కవిత! అనేక
తరాల పాటు ఇది నిలచి ఉంటుంది. కవిత ద్వారా నీ ప్రజ్ఞ జగద్వితమౌతుంది; అని.
రెండవవాడు అప్పుడు ప్రసన్నంగా అడిగాడు మొదటికవిని- ; మధ్య కాలంలో నువ్వేమిరాశావు?;
అని.
;నేను పెద్దగా ఏమీ రాయలేదు. తోటలో ఆడుకునే పిల్లవాడిని గుర్తుచేసుకుంటూ ఊరికే ఒక
ఎనిమిది లైనులు రాశానంతే.; అని మొదటికవి వాటిని పాడి వినిపించాడు.
దాన్ని విని రెండవవాడు మెచ్చుకున్నాడు- ;పర్లేదు, బాగానే ఉన్నది; అని.
ఆపైన వాళ్లిద్దరూ ఎవరిదారిన వాళ్లు వెళ్లారు.
ఇప్పుడు, రెండువేల సంవత్సరాల తర్వాత, మొదటి కవి రాసిన ఎనిమిది లైైన్లనీ ప్రతి నోరూ
పాడుతున్నది. అందరూ వాటిని ప్రేమగా గుర్తు చేసుకుంటున్నారు.
రెండో కవిత కూడా నిలచింది- లైబ్రరీలలోను, పండితుల అలమారల్లోను అది శతాబ్దాల పాటు
నిలచింది. దాన్నీ కొందరు గుర్తుంచుకున్నారు- అయితే ఎవ్వరూ దాన్ని ప్రేమించలేదు. ఎవ్వరూ
దాన్ని పలకలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!