ముంగిస - పిల్లాడు

ముంగిస - పిల్లాడు

SHYAMPRASAD +91 8099099083
0

ముంగిస - పిల్లాడు
మనమందరం మన తెలుగులోని  అపురూప నీతి కథలని మర్చిపోతున్నాంఇలాంటి కథలు నర్సరీల్లో పిల్లలకు నేర్పరుమనమే చొరవచేసుకుని మన పిల్లలకి అలనాటి నీతి కథలను చెప్పి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దుదాం.
ఎంతవారయినా తొందరపాటులో తప్పులు చేస్తుంటారుచివరికి  తప్పును తెలుసుకొని బాధ పడతుంటారుతొందరపాటు ఎప్పడూ ప్రమాదానికి హేతువుశివరామపుంలో విష్ణుశర్మ అనే పండితుడు ఉండేవాడుఅతని పెరటిలోఉన్న కుంకుడు చెట్టు క్రింద కలుగు చేసుకుని ఒక ముంగిస ఉండేదిఅది విష్ణుశర్మ భార్య పడేసిన చద్ది అన్నం తిని జీవిస్తూ ఉండేదిఒక రోజు విష్ణుశర్మ ప్రక్క ఊరిలో జరుగుతున్న పురాణ మహోత్సవాలలో పాల్గొనేందుకు వెళ్ళాడుముంగిస ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్యగది లోకి వెళ్ళి తలుపు మూల చల్లగా ఉండటంతో పడుకుందిఅదే గదిలో విష్ణు శర్మ ఏడాది పిల్లాడు ఉయ్యాలలో నిద్రపోతున్నాడువిష్ణుశర్మ భార్య వంటగదిలో పనీపాట చేసుకుంటోందిఎక్కడి నుంచి వచ్చిందో గాని  పాము ఇంటి పైకప్పులోకి చేరిందిఅక్కడ నుంచి ఉయ్యాల నుంచి నెమ్మదిగా ఉయ్యాలలో పడుకున్న పిల్లాడి వైపు రాసాగిందిఅదే సమయంలో కళ్ళు తెరిచిన ముంగిస ఉయ్యాల వైపు చుసిపాముని గమనించిందిఇన్నాళ్ళ నుంచి తనకి అన్నం పెడుతున్న అన్నపూర్ణ లాంటి విష్ణుశర్మ భార్య ఋణం తీర్చుకునే అవకాశం దొరికింది అనుకుంటూ అది ఎగిరి పాముని పట్టుకుని క్రిందకు దూకిందిపాము ముంగిస మధ్యపోరాటం మొదలైందిచివరికి ముంగిస పాముని చంపింది తరువాత అది తను చేసిన పని విష్ణుశర్మ భార్యకు చూపించాలని వంటగదిలోకి వెళ్ళింది నోటి వెంట రక్తంతో ఉన్న ముంగిసను చూస్తూనే అది తన పిల్లాడికి ఏదోహాని తల పెట్టిందని భావించిందివిష్ణుశర్మ భార్య చేతిలో ఉన్న పచ్చడి బండను దాని మీదకు విసిరింది దెబ్బకి పాపం మూంగిస చచ్చిపోయింది తరువాత వచ్చి ఉయ్యాలలో క్షేమంగా ఉండటం చూసి విష్ణుశర్మ భార్య ప్రక్కనేచచ్చిపడి ఉన్న పాముని చూసి జరిగిన విషయం అర్ధం చేసుకుని అనవసరంగా తొందరపడి మంగిసను చంపినందుకు బాధపడింది.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!