సన్యాసి-కౄరజంతువులు
పచ్చని కొండల్లో ఒకానొకప్పుడు ఒక సన్యాసి నివసించేవాడు.
ఆయన ఆత్మ శుధ్ధంగాను, హృదయం స్వచ్ఛంగాను ఉండేవి.
నేలమీద నడిచే జంతువులు, ఆకాశంలో ఎగిరే పక్షులు అన్నీ జంటలు జంటలుగా ఆయన దగ్గరికి
వచ్చి ఆయనతో మాట్లాడేవి. ఆయన వాటితో ప్రేమగా సంభాషించేవాడు. అవి సంతోషంగా ఆయన
మాటలు వినేవి. ఆయన చుట్టూ మూగేవి. చివరికి చీకటి పడ్డాక, ఆయన తన దీవెనలతో వాటిని
గాలికీ, అడవికి అప్పగించేంత వరకు అక్కడి నుండి కదిలేవి కావు.
ఒకనాటి సాయకాలం ఆయన ప్రేమ గురించి చెబుతుండగా చిరుత పులి ఒకటి తల ఎత్తి అడిగింది
ఆయనను- ;మీరు మాకు ప్రేమించడం గురించి చెబుతున్నారు. మరి, చెప్పండి స్వామీ, మీ జంట
ఏదీ?; అని.
;నాకు జంటదంటూ లేదు; అన్నాడు సన్యాసి.
అది వినగానే జంతువుల,పక్షుల సమూహం నుండి ఆశ్చర్యంతో కూడిన అరుపులు, ఊళలు,
కూతలు వెలువడ్డాయి. అవన్నీ తమలో తాము మాట్లాడుకోవటం మొదలుపెట్టాయి- ;ఈయన
మనకు ప్రేమించటం గురించీ, కలిసి జీవించటం గురించి చెబుతున్నాడు. జంటదే లేని ఈయనకు
అవన్నీ ఏం తెలుసని?; అని.
తిరస్కారంగా అవన్నీ ఒక్కొక్కటిగా లేచి తమ దారిన తాము వెళ్ళిపోయాయి.
ఆ రోజు రాత్రి సన్యాసి ఒంటరిగా తన గుడిశెలో చాపమీద బోర్లా పడుకొని, బిగ్గరగా ఏడ్చాడు