మాటపట్టింపు

మాటపట్టింపు

SHYAMPRASAD +91 8099099083
1


మాటపట్టింపు
వీధి కుక్కల అరుపులకు జానకయ్యకు మెలకువ వచ్చింది. ఆయన తలుపులు తీసుకుని ఇవతలికి
వచ్చి, కుక్కలను అదిలించి, లోపలికి రాబోతూ, అరుగు మీద ఎవరో ముడిచి పెట్టుకుని పడుకుని
వుండడం చూశాడు. ``ఎవరు వారు? అన్నాడు జానకయ్య. వైపు నుంచి జవాబు లేదు.
జానకయ్య మనిషిని తట్టి చూశాడు. అతను చలికి గడగడలాడి పోతున్నాడు; ఒళు్ళ జ్వరంతో
కాలిపోతున్నది. ``చలి ఎక్కువగా వుంది. ఒంట్లో బావున్నట్టు లేదు. లోపలికి వచ్చి పడుకో, అన్నాడు
జానకయ్య. అతను అతి కష్టం మీద లేచి, జానకయ్యకు చేతులు జోడించాడు. జానకయ్య అతడికి
చేతి ఆసరా ఇచ్చి, లోపలికి తీసుకువెళ్ళాడు.
తరవాత చాప పరిచి, కంబళి కప్పి పడుకోబెట్టాడు. మనిషి మరుక్షణం నిద్రలోకి జారుకున్నాడు.
అతన్ని గురించిన ఆలోచనలతో, జానకయ్యకు చాలా సేపటివరకూ నిద్రపట్టలేదు. ఎవరో తలుపు
దడదడ బాదుతూండగా అతడికి మెలుకువ వచ్చింది. సరికే బారెడు పొద్దెక్కింది. వచ్చింది
అతడి భార్య రత్నం. ఆమె క్రితం రాత్రి అదే ఊళ్ళో బంధువుల పెళ్ళికి హాజరయి,
తెల్లవారుతూనే ఇంటికి వచ్చింది.
``ఇంత పొద్దెక్కేదాకా పడుకున్నావేం? అంటూ లోపలికి వచ్చిన ఆమె, చాప మీద కంబళి కప్పుకుని
పడుకుని వున్న మనిషిని చూసి, ``ఎవరో వచ్చినట్టున్నారే! ఎవరు? అని భర్తను అడిగింది. ``ఏమో,
ఎవరో! అని జానకయ్య జరిగిందంతా చెప్పాడు. ``అయ్యో పాపం! వేడి పాలిస్తే కాస్త తేరుకుంటాడు.
మీరు అతన్ని లేపి మొహం కడుక్కోమని చెప్పండి, అంటూ ఆమె హడావుడిగా వంట గదిలోకి
వెళ్ళిపోయింది. జానకయ్య మనిషిని లేపుదామని ఒంటి మీద చెయ్యి వేసి, ఉలిక్కిపడ్డాడు. రాత్రి
నిప్పులా కాలిన అతని ఒళు్ళ ఇప్పుడు, మంచులా చల్లగా వున్నది. ``ఇతను పోయాడే! అంటూ
జానకయ్య ఒక వెర్రికేక పెట్టాడు. వంట గదిలోంచి రత్నం వచ్చి, ``పోయాడా అయ్యో! ఇప్పుడేం
చేద్దాం? అతని ఊరు ఏదో, అతని వాళు్ళ ఎక్కడ వున్నారో! అంటూ లబలబలాడింది. జానకయ్య
మనిషి నడుం తడిమి చూశాడు. చేతికి గలగలలాడుతూ డబ్బు సంచీ తగిలింది.
అతను సంచీ పైకి తీసి, కింద గుమ్మరించాడు. డబ్బుతో పాటు, ఒక ఉత్తరం కూడా కింద పడింది.
అందులో ఇలా ఉన్నది: ``బాబూ, నారాయణా! నీకీ మధ్య జ్వరం కాస్తున్నదని, మన ఊరు మనిషి
ఒకరు బజార్లో కనిపించి చెప్పాడు. ఇప్పుడు ఎలా వున్నది? ఇక్కడ నీ తము్మడి పరిస్థితి బాగాలేదు.
కూతురు పెళ్ళికి మూడు వేల రూపాయలు ఎలా తేగలనా అని, వాడి బెంగ. చాలా మంచి
సంబంధం. సమయంలో మీరు పాత స్పర్థలూ, మాటపట్టింపులూ మర్చిపోవాలి.
రాధ పెళ్ళికి నువు్వ డబ్బు సాయం చేయాలి. పెద్దవాడివి కనక, తము్మడి విషయంలో నువ్వే
సర్దుకుపోవాలి. ఉత్తరం అందగానే ఒంట్లో బావుంటే డబ్బు తీసుకుని బయలుదేరు. ఇక్కడ మేం
మరో ఇంటికి మారాం. కొత్త చిరునామా రాస్తున్నాను. ఉత్తరం వెంట తెచ్చుకుంటే, ఇల్లు తేలిగ్గా
కనుక్కోవచ్చు. జానకయ్యకు సంగతి అర్థమైపోయింది. అతడు భార్యతో, ``పాపం, తము్మడి
కూతురు పెళ్ళికి డబ్బు తీసుకుని బయలుదేరి, దారిలో పోయాడు.
ఉత్తరం వెంట వుంచుకోవడం మేలే అయింది! మనకు తము్మడి చిరునామా అయినా
తెలిసింది, అన్నాడు. ``మీరు వెంటనే బయలుదేరి ఊరు వెళ్ళండి. వాళ్ళకు ఉత్తరం, డబ్బూ
ఇచ్చేసి, సంగతి చెప్పి తీసుకురండి. మీరు వచ్చేదాకా నేను పెళ్ళివారి ఇంట్లోనే వుంటాను. ఇంటికి
తాళం పెడదాం, అన్నది రత్నం. జానకయ్య బాడుగ బండిలో రెండామడల దూరంలో వున్న
నారాయణ తము్మడి ఊరికి బయలుదేరాడు.
అతడికి ఇల్లు కనుక్కోవడం కష్టమేం కాలేదు. కాని లోపలికి వెళ్ళబోతున్న అతను, లోపలి నుంచి
వచ్చే మాటలు విని, గుమ్మంలోనే ఆగిపోయాడు. ``అమ్మా! డబ్బెక్కడా దొరకలేదు. ఇక నేను
చేయగలిగిందేమీ లేదు. పెళ్ళివారికి మరో సంబంధం చూసుకోమని చెప్పేస్తాను, అంటున్నారు
ఎవరో. బహుశా, తము్మడు కాబోలు! ``అదేం మాటరా! చక్కటి సంబంధం, డబ్బుకు వెనకాడి
వదులుకుంటామా? మీ అన్నయ్యకు డబ్బు తెమ్మని ఉత్తరం రాశాను.
తప్పకుండా తెస్తాడు, అంటున్నది తల్లి. మాటకు తము్మడు, ``నాకు చెప్పకుండా ఉత్తరం
ఎందుకు రాశావు? అన్నయ్య డబ్బు చచ్చినా నేను ముట్టను. డబ్బుతో నా కూతురిపెళ్ళి చేసేది
లేదు, అన్నాడు. ``చిన్న మాటపట్టింపుతో, మీ అన్నదము్మలు పదేళు్ళగా మొహాలు
చూసుకోలేదు. రాధ పెళ్ళిలో అయినా మీరు కలుసుకుంటారని ఇన్నాళు్ళగా ఆశపడ్డాను, అన్నది
తల్లి బొంగురుపోయిన గొంతుతో. జానకయ్య తలుపు తట్టి, ``నారాయణ తము్మడు గారి ఇల్లు
ఇదేనా? అన్నాడు.
లోపలినుంచి నలభై ఏళ్ళ మనిషి తలుపు తెరిచి, ``ఎవరు మీరు? లోపలికి రండి? అన్నాడు
ఆశ్చర్యపోతూ. జానకయ్య లోపలికి వెళ్ళి కుర్చీలో కూర్చుని, డబ్బుసంచీ బల్లమీద పెట్టి, ఉత్తరం
తము్మడు చేతికి ఇచ్చాడు. తము్మడు ఉత్తరం చదివి, ``ఇది, మా అమ్మ అన్నయ్యకు
రాసింది. తను రావడానికి మొహం చెల్లక, అన్నయ్య డబ్బు పంపివుంటాడు. ముందు డబ్బు
సంచీ, నా కళ్ళముందు నుంచి తీసేయండి! అన్నాడు కోపంతో. ``మీ అన్నయ్య స్వయంగా
వద్దామనుకున్నాడు; కాని రాలేకపోయాడు.
మీరిద్దరూ కలుసుకోవడం మరి జన్మలో జరగదు, అంటూ జరిగినదంతా చెప్పేశాడు జానకయ్య.
తల్లి ఘొల్లుమన్నది. ఒక క్షణం ఆగి తము్మడు అరచేతుల్లో మొహం దాచుకుని, ``అన్నయ్యా,
నన్ను క్షమించు! అంటూ ఏడ్వసాగాడు. ఏడుపు చూసి జానకయ్య ఏమాత్రం జాలిపడకుండా,
``బతికున్న మనిషి విలువ తెలుసుకోవటం కష్టం.
నీ మీద మీ అన్నకు ఎంత ప్రేమ లేకపోతే, ఒంట్లో బావుండకపోయినా, డబ్బు తీసుకుని
బయలుదేరు తాడు? నువు్వ సోదర ప్రేమకు ఇన్నాళూ్ళ దూరం అయ్యావు. ఇప్పుడది కోరినా
దొరకదు, అన్నాడు. ఇంటి శోకాలు విని ఇరుగు పొరుగు ఇళ్ళవాళు్ళ వచ్చారు. అంతలో, ``ఏమిటి
దంతా? ఏం జరిగింది? అంటూ ఒక యాభై ఏళ్ళ మనిషి అక్కడికొచ్చాడు. అతణ్ణి చూస్తూనే తల్లీ,
తము్మడూ ఏడ్పుమాని నిర్ఘాంతపోయారు.
తము్మడు అతణ్ణి సమీపిస్తూ, ``అన్నయ్యా, నువు్వ బతికే వున్నావా! నేను మూర్ఖుణ్ణి. నీ
మంచిగుణం తెలుసుకోలేకపోయాను, అంటూ కాళు్ళ పట్టుకున్నాడు. జానకయ్యకు వచ్చిన
మనిషి తామింతవరకూ చచ్చిపోయాడనుకునే నారాయణ అని అర్థమైపోయింది. సంగతంతా
తెలుసుకుని నారాయణ నవ్వి, ``నేను డబ్బు తీసుకుని మొన్ననే బయలుదేరాను.
రాధకు పట్టుచీర కొందామని పట్నం బజారుకు వెళ్ళాను. అక్కడ ఒక ముసలాడు, దిక్కులేనివాణ్ణి,
బిచ్చం అంటూ వెంటపడ్డాడు. జాలిపడి డబ్బు మూటపైకి తీసి, వాడికి ఒక రూపాయి ఇచ్చాను. నేను
దుకాణంలో చీరలు చూస్తుండగా, వాడు నా వెనకే తచ్చాడుతూండడం, నాకు అనుమానం
కలిగించింది. తీరా చీర తీసుకొని, డబ్బు కోసం చూసేసరికి, మొలలో దాచిన డబ్బు సంచీ లేదు.
ముసలాడి కోసం తెగ వెతికాను.
వాడు కనిపించలేదు. మళ్ళీ ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకుని, బయలుదేరి ఇక్కడికి వచ్చాను. మీ
ఇంట్లో చచ్చిపోయింది, దొంగే అయుంటాడు, అన్నాడు జానకయ్యతో. `` దొంగ చచ్చి మేలు
చేశాడు. అతడి పుణ్యమా అని, అన్నదము్మలు మళ్ళీ కలుసుకున్నారు, అన్నది తల్లి సంతోషంగా.
``ఇక నేను వెళతాను. ఇంటివద్ద జరగవలసిన పని చూడాలి, అంటూ జానకయ్య లేచాడు. ``వచ్చే
నెల మా అమ్మాయి పెళ్ళి. మీ ఇంటిల్లిపాదీ తప్పకుండా రావాలి, అంటూ, అన్నదము్మలిద్దరూ
జానకయ్యకు వీడ్కోలు చెప్పారు.

Post a Comment

1Comments

Post a Comment

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!