ఓ పెద్దాయన కథ
ఒక ఇరవైఐదు సవంత్సరాల గల యువకుడు ఒక మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఆరోజు ఆడిటింగ్ జరగడం వలన బస్టాప్ కి వచ్చేటప్పటికి రాత్రి పది దాటింది. బస్సులన్ని వెళ్లిపోయాయి.రోడ్డు మీదకు వచ్చి వాహనాలు కొరకు ఎదురు చూస్తున్నాడు. చాలా సేపు అయ్యింది కానీ ఏమీ రావట్లేదు. 11 గంటలు కావొస్తుంది ఇంటి దగ్గర అమ్మ ఎదురు చూస్తూ కంగారుపడుతూ ఉంటుంది . ఫోన్ చ్చేద్దామంటే ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది. లిఫ్ట్ అడుగుతున్నాడు .కానీ ఎవరు ఆపట్లేదు .ఇంచుమించు నలబై సవంత్సరాలు గల వ్యక్తి స్కూటీ పై వస్తున్నాడు. ఆ యువకుడు పెద్దాయనను ఎలాగైనా లిఫ్ట్ అడగాలని చెయ్యి ముందుకు పెట్టాడు. ఆ పెద్దాయన యువకుడు దగ్గరకు రాకుండానే స్కూటీ ఆపేసాడు. యువకుడు మనుసలో అబ్బా ఇది కూడా మిస్సైయింది.అని ఆలోచిస్తున్నాడు. ఆ పెద్దాయన స్కూటీ పక్కనపెట్టి రోడ్ మీద ఉన్న ఒక చిన్న బండ రాయిని తీసి పక్కన పొదల్లో వేసేసాడు.అక్కడ ఎవరో పంక్చర్ వేసుకొని అక్కడే వదిలి వెల్లుపోయారు. అది చూసిన యువకుడు నేను అరగంట నుంచి ఆ రాయిని చూస్తున్న తియ్యలనిపించిన ఎవరో పడితే నాకెందుకు లే అనుకున్న ఆ రాయిని తాకి ఎవరికైనా ఆక్సిడెంట్ అయ్యుంటే ఎంత గోరము జరిగేదో అనుకుంటూ చెయ్యి అడ్డుపెట్టాడు. పెద్దాయన స్కూటీ ఆపి లిఫ్ట్ ఇచ్చాడు.ఇద్దరు వెళ్తున్నారు . పెద్దాయన నువెక్కడకి వెళ్ళాలి బాబు అని అడిగాడు.ఆ యువకుడు మైచెర్లపాలెం వెళ్లాలి. అని అన్నాడు. ఆ పెద్దాయన సరే నేను అటువైపే వెళ్తున్నాను నిన్ను దించేస్తానులే అని చెప్పాడు.ఈ యువకుడు పెద్దాయన ఇంత రాత్రి పూట ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు . నేను ఎక్కడికి వేళ్ళను ఇలా రోడ్లు మీద తిరుగుతుంటాను.మరి నువ్వుఎక్కడి వెళ్తావు అని పెద్దాయన యువకున్ని అడిగాడు.ఇంకెక్కడకి మా ఇంటికి మా అమ్మ దగ్గర్కుఅని అని చెప్పాడు .ఏ మరి నీకు ఫ్యామిలీ లేదా అని అడిగాడు ఆ యువకుడు నీ కన్నా పెద్ద ఫ్యామిలీనే ఉంది బాబు . ఒక భార్య ముగ్గురు పిల్లలు నాకు ఫ్యామిలీ ఉంది కాని వాళ్లకే నేను లేను .ఏంటి పెద్దాయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు .మీ ఇల్లొచ్చింది దిగు అని పెద్దాయన యువకుడితో అన్నాడు .మా ఇల్లు నీకెలా తెలుసు అని పెద్దాయనను అడిగాడు యువకుడు. నేను చనిపోయి వారం అవుతుంది . రోడ్డుమీద ఎవరో విడిచి పెట్టిన రాయిని నీలా నిర్లక్ష్యం వలన ఎవరు తియ్యక పోవడం వలన చీకట్లో కనబడక స్కూటీ రాయకు గుద్ది కింద పడి చ్చనిపోయాను . ఎవరో చేసిన నిర్లక్ష్యం వలన నా కుటుంబానికి దూరమయ్యాను అని కన్నీళ్లు కారుస్తూ ఇంకెప్పుడు పరులకు అపకారం జరుగు ఏ విషయం లో నిర్లక్ష్యం మాత్రం చెయ్యకు అని పెద్దాయన యువకుడికి చెప్పి మాయమైపోయాడు.
మనము చేసె చిన్న చిన్న నిర్లక్ష్యాల వలన పెద్ద పెద్ద ప్రమాధాలే జరగొచ్చు .ఇతరులకు హాని తలపెట్టె ఏవిషయం లోను నిర్లక్షయముగా మాత్రం ఉండొద్దు .....