✅తెలుసు కుందాం✅
🔴రహదారులపై వాహనాల డ్రైవర్లు మత్తు పానీయాలు తీసుకున్నారని కనిపెట్టే బ్రీత్ ఎనలైజర్ ఎలా పనిచేస్తుంది?
✳వాహనాలను నడిపేవారు తాగి ఉన్నారో లేదో తెలుసుకోడానికి పోలీసులు ఉపయోగించే 'బ్రీత్ ఎనలైజర్' పేరుకు తగినట్టుగానే శ్వాసను విశ్లేషించడం ద్వారా పనిచేస్తుంది.ఒక వ్యక్తి మత్తుపానీయం సేవిస్తే అది అతని రక్తంలో కొంత శాతం కలుస్తుంది. ఆ రక్తం ఊపిరితిత్తులకు సరఫరా అయినపుడు అందులోని మత్తు పానీయం కొంత ఆవిరయి ఊపిరిలో కలుస్తుంది. రక్తంలో ఎంత ఎక్కువ మత్తుపానీయం కలిస్తే అంత ఎక్కువగా శ్వాసలో దాని ప్రభావం ఉంటుంది. అందువల్లే తాగిన వ్యక్తి దగ్గర వాసన వస్తుంది.
బ్రీత్ ఎనలైజర్‌లోని ఒక గొట్టం వ్యక్తి శ్వాసను పీల్చుకుంటుంది. పరికరంలో ఉండే ప్లాటినం ఏనోడ్ (విద్యుత్ ధ్రువం), వ్యక్తి శ్వాసలోని మత్తు పానీయాన్ని ఆక్సీకరించి ఎసిటిక్ యాసిడ్‌గా మారుస్తుంది. ఈ యాసిడ్‌లోని అణువులు కొన్ని ఎలక్ట్రాన్లను కోల్పోవడంతో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది. ఈ విద్యుత్ ప్రవాహం తీవ్రత ఎక్కువగా ఉంటే పరికరంలో ఎర్ర బల్బు, తక్కువగా ఉంటే ఆకుపచ్చ బల్బు వెలుగుతాయి. దాన్ని బట్టి ఆ వ్యక్తి ఎంత మేర మద్యం పుచ్చుకున్నాడో తెలుస్తుంది. ఈ మధ్య ఈ పరికరంలో ఎన్నో మార్పులు వచ్చాయి. కొన్ని పరికరాలు మత్తు పానీయం స్థాయిని అంకెల్లో చూసిస్తే, మరో కొన్ని రంగులు మార్పు ద్వారా చూపిస్తాయి.