కథ - తోడేలు సింహం మేక కథ

కథ - తోడేలు సింహం మేక కథ

SHYAMPRASAD +91 8099099083
0
కథ - తోడేలు సింహం మేక కథ
✍️... *నేటి చిట్టికథ* 

అడవి రాజు సింహానికి🦁 సహాయకునిగా ఒక
తోడేలు 🐺ఉండేది.

ఒకరోజు రెండు కలిసి ఆహారం వెదకటానికై అడవిలో తిరగసాగాయి.🦁🐺

వీరిద్దరినీ చూసి జంతువులన్నీ దూరంగా పారిపోవటంతో ఎంత వెదికినా ఆహారం దొరకలేదు వాళ్లకు. 

అలా వెదుకుతూ వెదుకుతూ అడవి చివరి వరకూ వచ్చేశాయి.🌳🌳

చాలాసేపటికి దూరంగా గడ్డి మేస్తూ ఒక మేక వాటి కంటబడింది.🐐

హమ్మయ్య అనుకుంది సింహం. 🦁కానీ తోడేలుకు మాత్రం ఆ మేకను చూడగానే పాపం అనిపించింది . సింహం దానిని ఎక్కడ తినివేస్తుందోనని భయం వేసింది.

 ఇది వరకు ఒకసారి ఆ మేక 🐐తన పాలు ఇచ్చి ఆకలితో చచ్చిపడివున్న తోడేలుని బ్రతికించింది
  
 అలా ఆనాడు తన ప్రాణాలు కాపాడిన మేకను ఎలాగైనా రక్షించాలని అనుకుంది తోడేలు.🐺

దాంతో.. వేగంగా మేకవైపు కదలబోతున్న సింహాన్ని🦁 ‘ఆగండి మహారాజా!’ అని గట్టిగా అరిచింది. 

ఆగిపోయిన సింహం🦁 ఏంటన్నట్టు చూసింది తోడేలు వైపు.🐺

‘మహారాజా...! ఆ మేకను పరిశీలనగా చూశారా?’ అంది మేకనే చూస్తూ.🐐

‘ఏమైంది దానికి? బాగానే ఉంది కదా!’ అని తిరిగి ప్రశ్నించింది సింహరాజు.🦁

‘బాగా లేదు మహారాజా! దాని మెడ కింద ఏవో పొడుగ్గా రెండు వేలాడుతున్నాయి. గమనించండి’ అంది.

మరింత పరిశీలనగా చూసిన సింహరాజు..🦁 ‘అవును. ఉన్నాయి. అయితే ఏమిటి?’ అంది ఆశ్చర్యంగా.

‘కొన్నింటికే అలా ఉంటాయి. అలా ఉన్న మేకలను తినకూడదు మహారాజా! అవి తిన్న వారికి మరణం సంభవిస్తుంది. మా అమ్మ అవి ఉన్న మేకను తినే చనిపోయింది..’ అంది దొంగ ఏడుపు నటిస్తూ🐺

ఆకలి వేసినప్పుడు దూకుడుగా వెళ్లి వేటాడి చంపి తినటమే తెలుసుగానీ అంత తీరికగా మేకలను పరిశీలించి చూడని సింహరాజు అవి అన్ని మేకలకూ ఉంటాయని తెలియక తోడేలు మాటలు నమ్మి వెనుదిరిగింది.🦁

‘హమ్మయ్య.. అమ్మ గురించి చెప్పిన అబద్ధం ఒక మిత్రుణ్ణి కాపాడగలిగింది’ అని మనసులో ఎంతో సంతోషపడ్డ తోడేలు🐺 సింహరాజుని అనుసరించింది.🦁

🍁🍁🍁🍁🍁🍁🍁


 పాపాన్నివారయతి, యోజయతే హితాయ,
 గుహ్యం నిగూహతి, గుణాన్ ప్రటీకరోతి
 ఆపద్గతం చ న జహాతి, దదాతి కాలేః
 సన్మిత్ర లక్షణ మిదం ప్రదన్తి సన్తః


ఇతరులను చెడుపనులనుండి నివారించేవాడు,
మంచిపనులను చేయడానికి ప్రోత్సహించేవాడు,
ఇతరులరహస్యాలను కాపాడటం,
పరులయొక్క సద్గుణాలను మెచ్చుకొనడం,
తమను ఆశ్రయించిన వారిని మాత్రమేకాక
ఆపదలో ఉన్నకాలంకో ఎవరినైనా విడువకుండా
ఉండటం, ఆయా పరిస్థితులకు అనుగుణంగా
ఆ పనులకు అవసరమైనవి అందించడం - ఈ గుణాలున్న
వాడు మంచి మిత్రుడని భావం.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!