బొట్టు పెట్టుకోవడం వెనుక గల శాస్త్రీయ ఉద్దేశం?
A: మన మనస్సులోని ఆలోచనల కేంద్రం మన నుదుటి మధ్య భాగమైన భ్రుకుటి ప్రాంతంలో ఉంటుంది.మన మనస్సులో ఆలోచనలు అధికమైనప్పుడు ఈ కేంద్రంలోనే నొప్పి కలుగుతుంది. అందువల్లనే మన మహర్షులు తిలకధారణ అని సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. గంధం యొక్క మహిమ వైద్యులందరికీ తెలుసు. మెదడులోని నాడులకు కేంద్రమైన ప్రాంతంలో గంధాన్ని ధరించడం వల్ల అవి సక్రమంగా పనిచేస్తాయి. గంధాన్ని తిలకంగా ధరించిన వ్యక్తికి తలనొప్పి రాదు సరికదా అతని మేథాశక్తి ఇంకా పెరుగుతుంది.
తిలకం ధరించడం ఒక గౌరవ సూచకం, మన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వారు తిరిగి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టి వారిని గౌరవిస్తాము. భారతీయ సంస్కృతిలో ఇంకే ఇతర సన్మానాలు కూడా తిలకధారణ లేకుండా జరగవు. యాత్రలకు వెళ్లే వారికి, యుద్ధానికి వెళ్ళేవారికి శుభాన్ని కాంక్షిస్తూ తిలకాన్ని ధరింపజేయడం మన సంస్కృతిలో ఒక భాగం. తిలక ధారణం వలన మానసిక శాంతి, ప్రసన్నత,ఉల్లాసం మరియు సఫలత్వం మొదలైన అనుభూతులు ప్రకటితమౌతాయి.