ది గ్రేట్ వివేకానంద | The Great Vivekananda

ది గ్రేట్ వివేకానంద | The Great Vivekananda

SHYAMPRASAD +91 8099099083
0

 ది గ్రేట్ వివేకానంద


స్వామి వివేకా నంద యూనివెర్సిటీ లో లా చదువుకునేటప్పుడు, పీటర్ అనే తెల్ల ప్రొఫెస్సర్ కి ఇతనంటే ఎందుకో నచ్చేది కాదు. 


ఒక రోజు, దైనింగ్ రూమ్ లో పీటర్ లంచ్ చేస్తుండగా, వివేకా నంద వచ్చి, పీటర్ పక్కనే కూర్చోని తన బాక్ష్ ఓపెన్ చేస్తుండగా...


ప్రోఫెసర్ : " పంది, పావురం పక్క పక్కన కూర్చోని భోజనం చెయ్యవు. అది నువ్వు తెలుసుకోవాలి"


దానికి వివేకా నంద, ప్రొఫెసర్ తో గొడవెందుకు అనుకుని ( చమత్కారంగా) : " మీరు దిగులు పడకండి సార్, నేను ఎగిరిపొతా" అని, వేరో టేబుల్ దగ్గరకెళ్లిపోయాడు.


ప్రోఫెసర్ మొహం ఎర్ర కంద గడ్డలా కందిపోయింది. ఎలాగైనా వివేకా నంద మీద ప్రతీకారం తీర్చుకోవాలుకున్నాడు.


ఆతరువాత ఒకరోజు  క్లాస్ రూమ్ లో, వివేకా నందని, ప్రోఫెసర్ ఓ ప్రశ్న వేసారు. "  వివేకా నందా!  నువ్వు రోడ్ మీద నడుస్తున్నప్పుడు, నీకు రెండు బాగ్ లు రొరికాయి అనుకుందాం. ఒక దానిలో జ్ణానం, ఇంకో బాగ్ లో డబ్బు వున్నాయి. నువ్వు దేనిని తీసుకుంటావు?"


వివేకా నంద (సందేహించకుండా) : "అనుమానమెందుకు సర్, దబ్బులున్న బ్యాగ్ నే తీసుకుంటాను"


ప్రోఫెసర్ వంకరగా నవ్వుతూ, వ్యంగ్యంగా "అనుకున్నా, నీ సమాదానం అదేనని. నేనే నీ ప్లేస్ లో వుంటే, జ్ణానమున్న బ్యాగ్ నే తీసుకుంటా"


వివేకా నంద : " నిజమే. ... సహజంగా....  ఎవరికి ఏది తక్కువో అదే తీసుకుంటారు కదా సర్!" .


ప్రొఫెసర్ కి తిక్కరేగిపోయింది. అవకాశం, టైమ్ కలిసి  వచ్చినప్పుడు వివేకా నందని వదలకూడదు అని ప్రతిజ్ణ పూనాడు, మనసులో


టైము, అవకాశం రెండు కిలిసి రానే వచ్చాయి, ప్రొఫెసర్ కి.  ఆరోజు, ఆదిద్దిన న్సర్ పేపర్ లు, క్లాస్ లో ఇవ్వలి. 

కోపంతో రగిలిపోయు వున్న ప్రొఫెసర్, వివేకా నంద ఆన్సర్ పేపర్ మీద ఈడియట్ అని వ్రాసి, వివేకా నందకి ఇచ్చాడు.


ఆన్సర్ షీట్ అందుకున్న వివేకా నంద, సీట్లో కూర్చొని, ప్రొఫెసర్ " ఈడియట్" అని వ్రాసింది చూసి, చాలాసేపు పట్టింది ... తనని తాను శాంత పరచుకోవడానికి. 


కోపం తగ్గిన తరువాత, హుందాగా, ప్రొఫెసర్ టేబుల్ దగ్గరకెళ్లి, గౌరవప్రదంగా, విన్రమయిన శాంత స్వరంతో  " పీటర్ సర్! తమరు నా అన్సర్ షీట్ లో సంతకం పెట్టారు. కానీ మార్క్స్ వెయ్యటం మర్చిపోయారు" 


వివేకా నంద ఏమన్నాడో, అర్దమయిన ప్రోఫెసర్ వడివడి నడుచుకుంటూ, క్లాస్ నుండి బయటికెళ్లి తన కొలీగ్ తో వాడితో‌ పెట్టుకోకూడదు అని వాపోయాడంట!!!

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!