ఓ అంధ కోమటి కథ
................................................................
వీరాపురం లో ధర్మ కోటి అనే కోమటి పుట్టుకతోనే గ్రుడ్డివాడు. తల్లి దండ్రులకు భారం కాకుడదనే తనకు చేతమైన సాయం చేసేవాడు.కళ్ళు కనబడకపోయిన వ్యా పార మెళుకువలు ఔపోసన పట్టన తెలివైన వాడు. అద్యాత్మిక చింతన కలవాడు కూడా.
యుక్త వయసు వచ్చినా అంధుడు కనుక పిల్లనిచ్చే వారే లేరు. తల్లిదండ్రులు చేయని ప్రయత్నం అంటూ లేదు. అయినా ఫలితం శూన్యం.
ఓ రోజు ఆ వూరికో సాధువు వచ్చాడు. ధర్మ కోటి అమ్మ నాన్నలతో పాటు వెళ్ళి సాధువును కలిశాడు.ఇతని దీనగాథ విన్న సాధువు ధర్మ కోటిని ఇష్టదైవం ను స్మరిస్తూ కొద్ది కాలం పాటు తపస్సు చేస్తే కళ్ళు వచ్చే అవకాశం ఉందని తెలియచేశాడు.
ధర్మ కోటి అడవికి వెళ్ళి ఘోర తపసు ఆచరించాడు. దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.
స్వామి నేను నా మనుమలు మనవరాండ్రతో ఏడేడు పద్నాలుగు అంతస్తుల నా బంగరు మేడ మీదనుండి రాజుగారు బంగారు పల్లకిలో ఊరేగూతూ ప్రజలకు దానధర్మాలు చేస్తూ వుంటే , అతని చల్లని పాలనలో ఏ లోటూ లేని కష్టజీవులైన ప్రజలు ధర్మం పట్టడానికి నిరాకరిస్తూ ఉండటం చూడాలని కోరుకొన్నాడు.
దేవుడు తథస్తూ అని వరం ఇచ్చాడు.
తెలివైన కోమటి కోరిన కోర్కెలలోని అంతరార్ధం ఏమిటి ? ఇందులో అతని స్వార్ధం ఏమిటి ? మనం నేర్చుకోవాల్సిన దేమిటి ?
.