🦅 Eagle Mentality
గ్రద్ద (డేగ) 🦅 మనస్తత్వం!
జీవితంలో ఎప్పుడూ చిలుక లాగా ఉండకు.
చిలుక ఎక్కువ మాట్లాడుతుంది కానీ ఎక్కువ ఎత్తు ఎగరలేదు.
గ్రద్ద 🦅 మౌనంగా ఉంటుంది కానీ దాని సంకల్ప శక్తి ఆకాశపు అంచులు తాకుతుంది.
ఇక్కడ ఒక గ్రద్ద మనస్తత్వం నుంచి మనం 7 ఆచరణలు తెలుసుకోవచ్చు
🦅 1-గ్రద్ద ఒంటరిగానే చాలా ఎత్తుకు ఎగురుతుంది.
పిచ్చుకలు, కాకులు, ఇతర చిన్న పక్షులతో గ్రద్ద ఎగరదు.
దీని అర్థం 👇
మిమ్మల్ని వెనక్కి లాగే ఇరుకు మనస్తత్వం గల, నెగిటివ్ మనుషులకు దూరంగా ఉండండి.
🦅 🦅 గ్రద్ద గ్రద్దలు తోనే ఎగురుతుంది.
ఒక సామెత ఉంది- ఆరునెలలు సావాసం చేస్తే వీడు వాడు అవుతాడంట.
మంచి సావాసం ఉంచండి. (గొప్ప మనస్తత్వం గల వ్యక్తులతో ఉండండి)
🦅 2-గ్రద్ద చాలా దూరం చూస్తుంది.
5కి.మి దూరం లో ఏం ఉన్నా గ్రద్ద చాలా సునిశితంగా చూస్తుంది.
ఎన్ని అడ్డంకులు వచ్చినా గ్రద్ద తన దృష్టిని ఎర నుంచి మరల్చదు, ఆ ఎరను పట్టుకునే వరకు.
దీని అర్థం 👇
అలాంటి దృష్టి నే మనం కలిగివుండాలి.
మన జీవితం పై కూడా మన దృష్టి ని కేంద్రీకరించాలి,
ఎలాంటి సవాళ్లను అడ్డంకులను ఎదుర్కొన్నప్పటికీ,
మన లక్ష్యం పైనే మన దృష్టి ఉండాలి, అది సాధించేవరకు.
3-గ్రద్ద(డేగ) 🦅 లకు భయం ఉండదు
దాని ఎర ఎంత పెద్దదైనా, ఎంత బలమైనదైనా సరే ఆ ఎరకి డేగ లొంగిపోదు. 🦅
ఒక 🦅 డేగ తన భూ భాగాన్ని పొందడానికి , తన ఎరను గెలవడానికి ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుంది.
జీవితంలో వచ్చే సమస్యలు ఎంత పెద్దవైనా సరే వదులుకోవద్దు, బదులుగా ఎదుర్కోండి.
విజయవంతమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు నిర్భయంగా ఉంటారు. వారు సమస్యలను ఎదుర్కొంటారు.
4- డేగలు చాలా మొండిగా పోరాడే స్వభావం గలవి.
డేగలు 🦅 తుఫాన్ లను ఇష్ట పడుతాయి, మేఘాలు గుమిగూడినపుడు డేగలు ఉత్సాహం గా రెచ్చిపోతాయి.
డేగలు తుఫాన్ గాలిని తనంతట తానుగా జీవించడానికి ఉపయోగిస్తాయి. డేగలు తుఫాను గాలిని కనుగొన్న తరువాత, డేగలు మేఘాల పైకి ఎగరడానికి ఉగ్రమైన తుఫానును ఉపయోగిస్తాయి. ఆ సమయంలోనే డేగలు 🦅 రెక్కలను ఆడించకుండా విశ్రాంతి గా జారవిడిచి గాలిని ఆధారం చేసుకుని మేఘాల పైకి వెళ్తాయి. అదే సమయంలో ఇతర పక్షులన్నీ చెట్టు కొమ్మల్లో, ఆకుల్లో దాక్కుంటాయి. దీని అర్థం 👇
సాధకులు సవాళ్ళకు భయపడరు, వాటిని ఆస్వాదిస్తారు మరియు లాభదాయకంగా ఉపయోగిస్తారు.
5- డేగలు 🦅 చచ్చిన వాటిని అసలు ముట్టవు.
డేగలు చచ్చిన మాంసాన్ని అసలు తినవు.
వేరే మాటల్లో చెప్పాలంటే
డేగ 🦅 చెత్తను (వ్యర్థ పదార్థాలను) అసలు ముట్టుకోదు. ఒక డేగ తనంతట తానే, అప్పుడే తన ఎరను వేటాడి తెచ్చుకున్న మాంసాన్ని మాత్రమే తింటుంది.
దీని అర్థం 👇
మీ గతంలో సాధించిన విజయాలను నెమరువేసుకుంటూ కూర్చోకండి.
గతం గతంః.
జయించడానికి కొత్త సరిహద్దులు వెతుకుతూ కదలండి. మీ గతాన్ని గతంలో ఉన్న చోటే వదిలేయండి.
6-డేగలు 🦅 శిక్షణ (నేర్చుకోవడానికి) కు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి.
డేగ పిల్లలు కొంత ఎదిగాక, గూడులోని ఈకలను, మెత్తటి గడ్డిని పెద్ద డేగలు తొలగిస్తాయి, తద్వారా పిల్ల డేగలు గూడులో అసౌకర్యానికి గురి అయ్యి గూడులో ఉండటం భరించలేనప్పుడు గాలిలో ఎగిరిపోతాయి.
దీని అర్థం
👇
మీ కంఫర్ట్ జోన్ ను వదిలివేయండి, అక్కడ ఎదుగుదల ఉండదు.
కంఫర్ట్ జోన్ లో గాడిద చాకిరీ, దానిని సమర్ధించుకునే మెట్ట వేదాంతం తప్ప ఏమి ఉండదు.
7- 🦅 డేగ కు తనను తాను మరల జీవంగా సృష్టించుకునే శక్తి ఉంది.
డేగ 🦅 40సంవత్సరాల వయసు వచ్చాక, దాని ఈకలు బాగా పెరిగి రెక్కలు బరువెక్కుతాయి, దాని చాతి కొయ్యలాగా తయారయ్యి ఎగరలేని స్థితికి వస్తుంది. దాని ముక్కు పెరిగి వంకర తిరిగి పోతుంది, దాని కాలి గోళ్లు బాగా పెరిగి తిన్నగా నిలబడటానికి కూడా అవకాశం లేకుండా పోతుంది.
ఇలా వయసు మళ్ళిన డేగ కు🦅 రెండే అవకాశాలు
1.చావడం
2.బ్రతకడం కోసం మార్పు చెందడం.
అపుడు డేగ 🦅 కొండల్లో ఉన్న తన గూడు🪹 దగ్గరకు వెళ్లి, ఎంతో నొప్పి, బాద ఉన్నా కూడా, మార్పు కోసం దాని వంకర తిరిగిన ముక్కు ను రాయికేసి బాది తొలగిస్తుంది. కొత్త ముక్కు వచ్చే దాకా ఆగి, దాని వంటి మీద బాగా పెరిగిన 🪶ఈకలను పీకి అవతల పడేస్తుంది. బాగా పెరిగి పోయిన గోళ్లను పీకేసి, మరల కొత్తగా ఈకలు, గోళ్లు వచ్చేదాకా దాని గూడు 🪹 లోనే ఎటువంటి ఆహారం లేకుండా ఉంటుంది.
కొంత కాలం తర్వాత డేగ 🦅 కు పూర్తిగా ఈకలు, గోళ్ళు వచ్చాక , దాని 40ఏళ్ళ జీవితంలో ఎప్పుడూ ఎగరలేని ఎత్తుకు నూతనోత్సాహంతో ఎగురుతుంది, మరల 30సంవత్సరాలు జీవిస్తుంది. బ్రతకడం కోసం, మనుగడ సాగించడం కోసం, డేగ 🦅 ఈ పని చేస్తుంది.
దీని అర్థం 👇
మనం కూడా మార్పు కోసం కొన్ని వదిలెయ్యాలి. అవి 👇
మన జీవితంలో సంభవించిన
చేదు గుర్తులను
వ్యతిరేక ఫలితాలనిచ్చే అలవాట్లను
పనికిరాని స్థిరమైన అభిప్రాయాలను
మెట్ట వేదాంతాన్ని (ఇది ఇంతే దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది).
ఇలాంటి బావ దారిద్ర్యాన్ని పీకి అవతల పడేయాలి.
శ్రీ కృష్ణుడు, అర్జునుడి లో ఉన్న ఈ మెట్ట వేదాంతాన్నే భగవద్గీత ద్వారా తీసివేసాడు.
Kosik Adavikolana, [04-Sep-22 10:40 PM]
డేగ 🦅 తన ఎరను ఆకాశం నుంచి చూస్తుంది. అలా పైనుంచి చూడటం వలన దానికి ఎర చిన్నగా కనపడుతుంది, అది ఎర దగ్గరకు వెళ్ళేసరికి ఎర చాలా పెద్దది, బలమైనది అని అనుకోదు, ఎర పెద్దగా కనిపిస్తున్న కొద్దీ
"నీను ఎరను పట్టుకుంటున్నాను" అని అనుకుంటుంది.
దీని అర్థం 👇
లక్ష్యం ఎంత పెద్దదైనా అది చేధించగలిగేది (గెలిచేది) గానే భావించాలి.
🦅 డేగ ను ఢీ కొట్టే జీవి కాకి కానీ👇
కాకి డేగ వీపు పై కూర్చుని, వెనుక నుంచి డేగ ను పొడుస్తూ చికాకు కలిగిస్తూ ఉంటుంది. కానీ డేగ 🦅 స్పందించదు, కాకి తో పోరాడదు. అపుడు డేగ 🦅 తన రెక్కలను చాపి ఆకాశం లో మరింత ఎత్తుకు ఎగరడం ప్రారంభిస్తుంది. చివరకు కాకి ఎగరలేని ఎత్తుకు డేగ చేరుకున్నాక, కాకికి ఊపిరి అందదు, అపుడు కాకి డేగ ను పొడవటం ఆపి, క్రిందికి పడిపోతుంది, డేగ 🦅 స్వేచ్చగా ఎగురుతుంది.
దీని అర్థం 👇
కాకులు లాంటి వ్యక్తులతో మీ సమయాన్ని వృదా చేయకండి. పుల్లవిరుపు మాటలు మాట్లాడే వాళ్ళు, వెటకారాలు చేసే వాళ్ళు, వెక్కిరించే వాళ్ళు, విమర్శించే వాళ్ళతో పోరాడకండి! మీ సమయం, శక్తి ని వృధా చేసుకోకండి.
మీ పని చేస్తూ ముందుకు కదలండి, నేర్చుకుంటూ ముందుకు కదలండి.
వ్యక్తులు మిమ్మల్ని విమర్శించినపుడు
డేగ లా పైకి వెళ్ళండి.
రెచ్చగొడితే- పని చేస్తూ ముందుకు కదలండి
అంతులేనిది గా అనిపించినపుడు - ఫలితం ఆశించకుండా మీ పని చేస్తూ ముందుకు కదలండి.
కష్ట పడి, తెలివిగా పని చేస్తూ ముందుకు కదలండి
మీరు ఎదుగుతున్న కొద్దీ మిమ్మల్ని విమర్శించే కాకులకు ఊపిరి పీల్చుకోలేవు.
లే పైకి లే, కదులు నీ పని చేస్తూ, నీ పని నేర్చుకుంటూ ముందుకు కదులు.
నువ్వు ఆగితే, కాకులకు లొంగినట్లే! కదులు పైకి కదులు కాకులకు ఊపిరి అందకుండా పైకి కదులు!
నిన్ను వెనుక నుంచి పొడిచే, నీలో నుంచి వచ్చే కాకులకు కూడా అందకుండా ముందుకు కదులు.
అంతే, ఇంతే, దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది అనే నీలోని దొంగ కాకులకు లొంగకుండా నీ పని చేస్తూ పైకి కదులు!
బయట కాకులకు, నీలోనే దాక్కుని ఉన్న దొంగ కాకులకు ఊపిరి అందకుండా పైకి కదులు, డేగ 🦅 లా ఉండు!
Source from Eagle 🦅
Kousiik.
Hi Please, Do not Spam in Comments